01-11-2025 05:18:30 PM
గరుడ ముద్ద కోసం పోటీపడిన భక్తులు
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్వజారోహణ సందర్భంగా పూజారులు ఎగరవేసిన స్వామివారి అత్యంత పవిత్రమైన గరుడ ముద్ద కోసం భక్తులు పోటీపడ్డారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విష్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభారాధన, పూర్ణాహుతి, శేషవాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ఈవో సల్వాది మోహన్ బాబు, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.