calender_icon.png 19 December, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఖండన

19-12-2025 12:52:30 AM

  1. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటై బీజేపీపై అబాండాలు
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆ ర్‌ఎస్ పార్టీలు కలిసి పని చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు స్వతహాగా కష్టపడి ప్రజల అండతోనే అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులను గెలుచుకుందని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటి కాకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సమర్థించడం దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రె స్, బీఆర్‌ఎస్ ఒక్కటై కుట్రలు, కుతంత్రాలతో బీజేపీ అబాండాలు వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.