calender_icon.png 13 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై హర్షం

12-07-2025 10:17:46 PM

భూత్పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బిసి రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగు పెట్టడం ఒక చారితాత్మక, విప్లవాత్మక నిర్ణయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా శనివారం మున్సిపాలిటీ పట్టణంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ వదిలేయకుండా బీసీలకు న్యాయం జరగాలన్న సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్లలో బీసీలకు 42 శాతం పెంచుతూ ఆర్డినెన్స్ను వెలువడించిన ఘన నాయకుడు సీఎం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పద్మ, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్. భూపతి రెడ్డి,  మండల ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ గౌడ్,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్యానాయక్, నరేందర్, తిరుపతి రెడ్డి, నరసింహ, టీవీ రెడ్డి, బోరింగ్ నర్సింలు, అప్రోజ్, శ్రీను తోపాటు తదితరులు పాల్గొన్నారు.