10-12-2025 01:50:14 AM
మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష
ఆదిలాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అబ్జర్వర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడు తూ.. ఎన్నికల సామాగ్రి పంపిణీలో ఎటు వంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిం చాలని అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి అని చెప్పారు. పోలింగ్ సామాగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పా ట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. సరిపడినంత మంది సిబ్బందిని నియమించడంతో పాటు, వారికి శిక్షణ పూర్తి చేశామని తెలిపారు.
ఎన్ని కల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. పోలీసు బందోబస్తుతో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మొదటి విడత ఎన్నికలను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేస్తామని వివరించారు. ఈ వీడియో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డిపిఓ రమేష్, డిడబ్ల్యుఓ మిల్కా, డిఎల్పీవో ఫణిందర్ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 9(విజయక్రాంతి):పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు.ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి పాఠ శాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, కుర్చీలు, టేబుల్లు, లైటిం గ్, త్రాగునీరు, అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండాలని సూ చించారు.
ఓటింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని వెల్లడించారు.తర్వాత విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, విద్యా వసతులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, యూ నిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను సూచించారు.
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు
నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమ్ముదుని పలు సూచనలు చేశారని వివరించారు.
మొదటి విడత జరిగే ఎన్నికలను ఈనెల 11న ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. సమసాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత చర్యలను వెబ్ కాస్టింగ్ పోను విధానాన్ని పక్కగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి ఎన్నికల జిల్లా పరిశీలకు రాలు ఆయేషా ముసఫ్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ డిపిఓ శ్రీనివాస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
11వ తేదీ పంచాయతీ ఎన్నికల కోసం సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులకు సూచించారు.వాంకిడి మం డల కేంద్రంలోని పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్లు దీపక్ తివారి ,డేవిడ్ లతో కలిసిక పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. రద్దీ లేకుండా కౌంటర్లు, హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
10 తేదీ సాయం త్రం 4 గంటలలోగా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాలని, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అనంతరం కస్తూరిబా విద్యాలయంలో నిర్మాణంలో ఉన్న అదనపు గదుల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన బోధన, పౌష్టికాహారం అందించాలని అన్నారు.