calender_icon.png 6 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలి

06-12-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, డిసెంబర్ 05 (విజయ క్రాంతి)  పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత పోలింగ్ సిబ్బందికి కేటాయించిన మండలంలో శిక్షణ పూర్తి అయ్యాక డిసెంబర్ 6 న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ స్వస్థల మండలం (ఓటు హక్కు నమోదైన) ఎంపీడీవో కార్యాలయం కు హాజరై పోస్టల్ బ్యాలెట్ సదు పాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలె ట్ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో తమ వెంట ఫారం 14, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ సిబ్బంది తీసుకొని రావాలని, మొదటి విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఉన్నతాధికారులు అందించిన సూచనలు పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.