09-05-2025 01:22:09 AM
-జిల్లా ఆదనపు కలెక్టర్ డేవిడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 8(విజయ క్రాంతి):ప్రభుత్వం భూ సమస్యల పరిష్కార కోసం నిర్వ-హిస్తున్న రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని జిల్లా అద-నపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు.
గురువారం జిల్లాలో పైలెట్ మండలం గా ఎంపికైన పెంచికల్ పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులను సమర్పించాలని, ఈ దరఖాస్తుల వివరాలను నమోదు చేసుకుని తక్షణమే పరిష్క-రించే దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కవిత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.