06-05-2025 01:21:58 AM
అయోమయంలో ఆశావహులు
రోజుకో నిబంధన.. వడపోతలతో సరి
మహబూబాబాద్, మే 5 (విజయ క్రాం తి): ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గందరగో ళంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక ఊరు చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారని, మిగిలిన గ్రామాల్లో రోజుకోతీరుగా నిబంధనల పేరుతో లబ్ధిదారుల ఎంపికలను తరచుగా మారుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఏడాదికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ప్రకటించారు.
ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలో 482 గ్రామాలు ఉండగా, 6,35,872 మంది జనాభా ఉన్నారు. జనా భా సంఖ్య కు అనుగుణంగా గ్రామాల వారి గా తొలుత ఇండ్ల కేటాయింపు జరిగింది. ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది లబ్ధిదారుల నుండి స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలుగా విభజించి, క్షేత్రస్థాయికి వెళ్లి ఇండ్లు లేని లబ్ధిదారుల ఫోటోలను తీశారు.
ఈ రకంగా రూపొందించిన జాబితా చాన్తాడంతగా పెరిగిపోవ డంతో, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మాత్రమే ఏడాదికి ప్రభుత్వం కేటాయిస్తుండడంతో మొదటి సంవత్సరానికి గాను లబ్ధిదారుల తగ్గించేందుకు వడపోవడానికి నిర్ణయించి, అర్హులైన జాబితాలో ఉన్న లబ్ధిదారులను ఐదు భాగాలుగా చేశారు. ఆ మేర కు మళ్లీ గ్రామాల్లో కేటాయింపు చేసిన ప్రకారం చూస్తే అర్హులైన వారు ఎక్కువగా ఉండడంతో, మళ్లీ వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారుల్లో ఇండ్ల కేటాయింపు సంఖ్యకు తగ్గ ట్టుగా కుదించేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. గతంలో ప్రభుత్వం నుండి ఇండ్లు పొందిన వారిని తొలగించారు. అలాగే ఇప్పటికే అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారిని పక్కన పెట్టారు. ఆ తర్వాత ట్రాక్టర్, కారు ఉన్న వారిని తొలగించారు. అలాగే కుటుంబంలో ఎవరైనా ప్రభు త్వ ఉద్యోగి ఉంటే వారిని కూడా పక్కకు పెట్టారు.
చివరకు ఒక్క కొడుకు ఉండి పక్క గృహం ఉంటే ఇల్లు మంజూరు చేయకూడదని నిర్ణయించారు. ఈ విధంగా వడ పోసి నప్పటికి గ్రామానికి కేటాయించిన ఇండ్ల సంఖ్యకు, మొదటి విడత అర్హులైన వారికి ఇండ్లు కేటాయించే పరిస్థితి కొన్నిచోట్ల లేకపోగా, మరి కొన్ని చోట్ల సంఖ్య ఎక్కువ ఉండి అర్హులైన లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉండటంతో వచ్చే ఏడాది జాబితాలో ఉన్న వారిని చేర్చుతున్నారు. ఇలా చేర్పులు మార్పులతోనే కాలం వెళ్లదీస్తుండడంతో ఇప్పటికీ అర్హులైన లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదంటున్నారు.
దీనితో పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో మినహా ఇతర గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు వ్యవహారం రోజుకో తీరుగా మారుతూ గందరగోళంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదించిన వారికి పలు గ్రామాల్లో చోటు దక్కడం లేదని, ఇంకొన్ని చోట్ల అనర్హులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఎంపిక చేస్తున్నారని విమర్శలు వస్తు న్నాయి. అయితే మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ ఇవ్వలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాతలకాలంగా మట్టి ఇంట్లోనే.. ఉంటున్నా దక్కని ఇందిరమ్మ ఇల్లు
తాతల కాలం నుండి పాతకాలం మట్టి ఇంట్లోనే ఉంటున్న. మట్టి కొంతమేర కూలిపోతే రేకులు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నాం. ఇది తప్ప నాకు ఎక్కడ కూడా సెంటు భూమి లేదు. అయినా నాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదు. మా ఊర్లో అత్యంత పేదల్లో నేనొక్కడిని. ఫోటో తీసుకుని వెళ్లారు. ఇల్లు గురించి అడిగితే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. దయచేసి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి పుణ్యం కట్టుకోండి.
ఎర్నం శేషయ్య, కోరుకొండపల్లి, కేసముద్రం
ఒక్క నెంబర్ ఎక్కువైందని ఇల్లు మంజూరు చేయలేదు..
మా గ్రామంలో జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారంటే ఎంతో సంతోష పడ్డాము. గుండె జబ్బుతో బాధపడుతున్న నేను పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న నేపథ్యంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని ఆశతో ఉన్నాను. అయితే మా ఊరికి 16 ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయని, నీ పేరు 17వ నంబర్లో ఉంది, వచ్చే ఏడాది మంజూరు చేసే రెండో ఇండ్ల జాబితాలో చేర్చి తప్పకుండా ఇల్లు ఇస్తామని చెబుతున్నారు. మా ఊరిలో నేనే అతి పేద వాడిని, నన్ను కాదని ఇతరులకు ఇవ్వడం భావ్యం కాదు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి నాకు మొదటి విడత లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నా.
- షేక్ పాషా, గిరిపురం, మరిపెడ వికలాంగుడికి మొండి చేయి
జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో రేకులు వేసుకొని చుట్టుపరదా లు కట్టుకొని భార్య ఇద్దరు పిల్లలతోజీవనం సాగిస్తున్నా. వికలాంగు డను, ఇందిరమ్మ పథకంలో మొదటి విడతలోనే ఇల్లు వస్తుందని ఎంతో ఆశ పడ్డాను. నాకు మొదటి విడ తలో మొండి చేయి చూపారు. నాలాంటి పేదల పట్ల వివక్ష చూపడం ఏమిటి. అధికారులు స్పందించి నాకు మొదటి విడత లోనే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి.
చెడుపాక లక్ష్మణ్, చిన్న నాగారం, ఇనుగుర్తి