calender_icon.png 30 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గిన్నిస్’ సాధనలో భాగస్వామికి అభినందన

30-12-2025 01:51:28 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పరిధి ఘనపూర్‌లోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం బీ.టెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగానికి చెందిన విద్యార్థి శివగణేష్ తాలికోట, గూగుల్ ఫర్ డెవలపర్స్, గూగుల్ డెవలపర్ గ్రూప్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏజెంట్ ఏఐ ఏకతోన్ ద మోస్ట్‌లో పాల్గొని, ద మోస్ట్ పార్టిసిపెయింట్స్ ఇన్ అండ్ ఏజెన్టిక్ ఏఐ ఏకతోన్ అనే విభాగంలో గిన్నిస్ వరల్ రికార్డ్ సాధనలో భాగస్వామిగా నిలిచిన విషయం గర్వకారణమని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈప్రపంచ రికార్డు ఈనెల డిసెంబర్ 21న హైదరాబాద్ లో సాధించబడింది.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్, డైరెక్టర్ (స్ట్రాటజీ) కొమ్మూరి దివ్య, డైరెక్టర్  ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ్ కాశ్యప్, ఏఐ అండ్ ఎంఎల్ హెచ్‌ఓడి డాక్టర్ సత్యనారాయణ, ఇతర డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు శివగణేష్ తాలికోటని అభినందించారు. ఇలాంటి విజయాలు కళాశాల విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను, పరిశ్రమకు సిద్ధమైన ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని వారు తెలిపారు. ఈవిజయంతో కళాశాలకు గౌరవం తీసుకొచ్చిన విద్యార్థికి యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.