30-12-2025 02:14:22 AM
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు యాంటి డ్రగ్ కమిటీల ఏర్పాటు
ప్రధాన నేరాల కేసుల సంఖ్య తగ్గుముఖం
వార్షిక నివేదిక సమావేశంలో వెల్లడించిన ఎస్పీ మహాజన్
ఆదిలాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జిల్లాలో అసాంఘిక కార్యకలాపా లను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గత ఏడాది కంటే ఈ సం వత్సరం చిన్న చితక కేసులు మినహా ప్రధాన నేరాల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.
సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వాటర్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా వార్షిక నేర నివేదిక విడుదల చేసి, వివరాలు వెల్లడించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధ్యతలను స్వీకరించి మొదటి రోజు నుండి ప్రజలను పోలీసు పట్ల విశ్వాసం నమ్మకం పెంచే విధంగా సరికొత్త నూతన విధానాలతో ప్రజలలో మమేకమయ్యే విధంగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు చిన్నారుల రక్షణకై షీ టీం ను పటిష్టం చేయడం, ఆపరేషన్ జ్వాలా, పోలీస్ అక్క ద్వారా మహిళలకు విద్యార్థినిలకు దగ్గర కావడం జరిగిందని. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులచే యాంటి డ్రగ్ కమిటీ లను ఏర్పాటు చేయడం, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా 5కె రన్ లాంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హాట్స్పాట్లను, బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ రాంబల్స్ టిప్స్, ఇంజనీరింగ్ సమస్యను పరిష్కరించడం, పోలీసు వాహనం, పోలీసు కట్ అవుట్లను ఏర్పాటు చేయడం, రోడ్ సేఫ్టీ క్లబ్ ద్వారా ప్రమాదాలను నివారించేందుకు అవగాహన, జరిగిన ప్రమాదాలలో ప్రాణనష్టాన్ని తగ్గించే విధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లను, సిపిఆర్ లను శిక్షణ అందించి వాటిని వినియోగించేలా చేయడం జరుగుతోందన్నారు.
మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలకు మరింత చేరువ కావడానికి ఆదివాసి ప్రజలకు యువతకు చదువు పట్ల అవగాహన కల్పించడం, విద్యతో ఉన్న ప్రయోజనాలను తెలియజేయడం, ఆదివాసులకు ఉచిత మెడికల్ క్యాం పులను, జాబ్ మేళాలను నిర్వహించడం, చలికాలంలో దుప్పట్లను అందించడం, యువత క్రీడారంగంలో అభివృద్ధి చెందాలని వాలీబా ల్ కిట్లను అందజేయడం జరిగిందని తెలిపారు.
మీడియా సమావేశంలో ఏఎస్పీ మౌని క, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, చంద్రశేఖర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ గుణవంతురావ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.