30-12-2025 01:47:41 AM
మొబైల్ యాప్ నిబంధన తొలగించాలని డిమాండ్
ఖమ్మం జిల్లా తల్లాడలో ఆందోళన
ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ మొబైల్ యాప్ నిబంధనలతో ఇబ్బందులు పెడుతున్నామంటూ ఖమ్మం జిల్లా రైతులు సోమవారం రోడ్డెక్కారు. జిల్లాలోని తల్లాడకు చెందిన రైతులు సోమవారం ప్రభుత్వ విక్రయ కేంద్రాలకు వెళ్లగా యూరియా దొరకలేదు. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనలపై ఆగ్రహానికి గురయ్యారు. యాప్ నిబంధన తొలగించి, నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏవో తాజుద్దీన్ అక్కడి వెళ్లి యూరియా అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.