30-12-2025 01:52:11 AM
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేస్తూ.. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యమని అన్నారు.
ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానమివ్వాలని అన్నారు. ఎమ్మెల్యేలు కూడా సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా అధ్యయనం చేసి రావా లని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేందరూ హాజరయ్యేలా మం త్రులు, విప్‌లు సమన్వయం చేయాలని సూచించారు. కృష్ణా జలాలపై సభ లో చర్చ జరిగే సమయంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అలర్ట్‌గా ఉండే విధంగా చూడాలన్నారు. బీఏసీ సమావేశాన్ని 4వ తేదీని మరోసారి ఏర్పాటు చేసుకుందామని సీఎం చెప్పారు.
మీకు ఎలా చెబుతాం..?
ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శాసన సభ ప్రారంభమైన తర్వాత కేసీఆర్ వద్దకు సీఎం వెళ్లారు. కేసీఆర్‌తో కరచాలనం చేసి బాగున్నారా అని పలకరిం చారు. ఆ తర్వాత శాసన మండలి పనురుద్ధరణ పనులను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించి.. తన ఛాంబర్ వద్దకు వెళుతుండగా అసెంబ్లీ లాబీలో మీడి యాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ వద్దకు వెళ్లిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా ముఖ్యమంత్రి స్పందించారు. ‘ప్రతి సభ్యుడిని మేం గౌరవిస్తాం.
కేసీఆర్‌ను ఇవాళే కాదు.. అసుప త్రి లో కూడా కలిశా. కేసీఆర్‌ను కలవడం రెం డోసారి. అసెంబ్లీ నుంచి వెంటనే ఎందు కు వెళ్లారో అయన్నే అడగాలి’ అని సీఎం పేర్కొన్నారు. మీరిద్దరు ఏమి మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘మేమి ద్దం ఏమి మాట్లాడుకున్నది మీకెలా చెబు తాం..? అక్కడ అడగాల్సిన విషయాలు ఇక్కడ ఆడగడం ఎందుకు..?’ అని సీఎం వ్యా ఖ్యానించారు.
పార్లమెంట్ తరహాలో శాసన సభలోనూ సెంట్రల్ హాల్ ఉంటుందని సీఎం తెలిపారు. ఈ సెంట్రల్ హాల్ ఏర్పాటు చేయడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు యాక్సెస్ ఉంటుందని, మాజీ ఎమ్మెల్యేలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల వరకు శాసనమండలి భవనం పనులు పూర్తిచేయాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు.