calender_icon.png 30 December, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లో రైతులు పడిగాపులు

30-12-2025 02:14:18 AM

రైతుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రైతులు పంట అమ్ముకోవడానికి పడుతున్న కష్టాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో లేవనెత్తారు.  సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... బోథ్ నియోజకవర్గంలోని మార్కెట్ యార్డులలో సోయా, మొక్క జొన్నలు 10వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం పేరుకుపోయిందని పంటను అమ్ముకోవడానికి మార్కెట్లో రైతులు పడిగాపులు పడుతున్నారన్నారు. వెంటనే పంటలను కొనుగోలు చేయాలని కోరారు.

అలాగే వెనుకబడిన బోథ్ నియోజకవర్గంలో గిరిజన బిడ్డలకు ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన  ఇంటిగ్రేటెడ్ పాఠశాలను బోథ్ లో ఏర్పాటు చేయాలనీ కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బోథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు బోథ్ ను రెవిన్యూ  డివిజన్ గా ప్రకటించాలని కోరారు.