02-11-2025 07:20:22 PM
కార్యాలయంపై దాడులు చేయటం ఏంటి.
కాంగ్రెస్ వచ్చాక దాడులు పెరుగుతున్నాయి..
బిఆర్ఎస్ నేత రావులపల్లి మానే రామకృష్ణ
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని టిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ ఒక ప్రకటనలో ఖండించారు. పార్టీ కార్యాలపై దాడులు చేయటం హేయమైన చర్య అని.. ప్రభుత్వం అధికారులు చట్ట పరమైన చర్యలు తీసుకొని దాడి చేసిన వారిని శిక్షించాలని, ఇటువంటి ప్రజాస్వామ్యంలో కరెక్టు కాదని, కేవలం ఒక పథకం ప్రకారం మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఆక్రమించాలని చూస్తుందని ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు.