22-12-2025 12:00:00 AM
మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు
రేగోడు, డిసెంబర్ 21: రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వంమే అని మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరపున వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన వారితో పాటు బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అధర్యపడవద్దని రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రతి కార్యకర్త కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.
పంచాయతీ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, మాజీ సర్పంచ్లు బాదనపల్లి నరసింహులు, గోపాల కృష్ణ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు మొయిజుద్దీన్, నాయకులు మునిరోద్దీన్, కోట సంగప్ప, గొల్ల శేఖర్ , రాజు కమల్, అమృత్, రాచోటి నాగరాజు, ఉప్పరి సాయిలు, శ్రీనివాస్, సల్మాన్, అమృత, గోపాన్ పల్లి అంజప్ప, గొల్ల శివన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.