07-05-2025 01:23:04 AM
సిరిసిల్ల, మే 6 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అ యినట్టేనని, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌ను మంగళవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భం గా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేమన్న విషయాన్ని సీఎం రేవంత్ తేల్చేశారని అన్నారు. ఇక వృద్ధులకు 4 వేల పింఛన్, మహిళలకు నెలనెలా రూ. 2500, తులం బం గారం ఒట్టిమాటేనని తేలిందన్నారు.
నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భ రోసా కార్డు, రైతులకిచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసినట్టేనని ఆరోపించారు. సంవిధాన్ పుస్తకం పట్టుకొని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు.