calender_icon.png 7 May, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి

07-05-2025 01:22:34 AM

  1. వ్యక్తిగతంగా పదవులు ఇచ్చేది లేదు
  2. పని చేసే వారికే పదవులు వరిస్తాయి
  3. చేసిన పనులు చెప్పుకోవడంలో వెనకపడ్డం
  4. పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాలి
  5. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి , మే 6 (విజయ క్రాంతి):   ఢిల్లీలో ఆది నాయకత్వం చెప్పే ప్రతి అంశా న్ని గల్లి వరకు తీసుకెళ్లే నాయకత్వం కాంగ్రెస్ కు చాలా అవసరం అని, పార్టీలో యువ రక్తానికి  అవకాశం కల్పించాలని, పదవుల ను అలంకారప్రాయంగా కోరకుండా అంకితభావంతో పనిచేసే వారికే పదవులు వరిస్తా యని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఫువాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, పాలేరు నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనేక మంది కార్యకర్తల శ్రమ ఫలితం తోనే  నేడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి  వచ్చిందన్నారు. .

తరతరాల నుండి కాంగ్రెస్ పార్టీనీ తమ పార్టీ అని భావించే చరిత్ర కాంగ్రెస్ పా ర్టీది , అలాంటి చరిత్ర మారేపార్టీకి లేదని మంత్రి పొంగులేటి అన్నారు.. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన, బ్యాంకుల జాతీయకరణ  ,ఎన్నో సంస్కరణ లు,చివరికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడఇవ్వడంలోనూ  కాంగ్రెస్ పాత్ర అమోఘం అన్నా రు..  ప్రతి గ్రామ ,మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ సంస్థాగతంగా నిర్మాణం జరగాలనీ పిలుపునిచ్చారు.

పార్టీకి కొత్త రక్తం అవసరం ఉందని. వ్యక్తిగతంగా పదవులు ఇచ్చేది లేదని పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కాలన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా అగ్ర నాయకత్వం పిలుపుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరో పక్క ప్రతిపక్షం ఉద్యోగ సంఘాలను రెచ్చకొట్టే పనిలో ఉందని తెలిపారు.

ఎనిమిదో వింత అని చెప్పిన కాళేశ్వరం కూలిపో తే ప్రజలకు నిజాలు చెప్పకుండా ఎలా ఉం టామాన్నారు  రూ 20 వేల కోట్లతో రైతు రుణమాఫీ , 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు , రైతన్నను అరిగోసా పెట్టిన ధరణి స్థానంలో భూ భారతి చట్టం రైతన్నలకు అండగా ఉం టుందని ఇటువంటి అద్భుతమైన పథకాల అమలు జరుగుతున్నాయని చెప్పారు.

అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రచారం చేసుకో వడంలో తమ పార్టీ విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు పాలనలో ఉన్న బీఆర్‌ఎస్ చేయలేని పనులు 16 నెలల్లో చేసి చూపించమాన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందు కే పార్టీ నిర్మాణం జరగాలి.. ఈ నెల 31 వర కు గ్రామ, మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికకు దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ డిల్లీలో ఒక మాట చెపితే గ ల్లీ వరకు తీసుకెళ్ళే క్యాడర్ కావాలి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్య క్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు , బాలసాని లక్ష్మీనారాయణ, బెబీ స్వరణకుమారి , మట్టే గురవయ్య ,ఆత్మకమిటి చైర్మన్ శివరామకృష్ణ , మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు , సీడిసి చైర్మన్ యరబో లు సూర్యనారాయణ రెడ్డి , మాదాసు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.