07-05-2025 01:24:58 AM
తగ్గనున్న వాణిజ్య సుంకాలు
న్యూఢిల్లీ, మే 6: భారత్, యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. మంగళవారం బ్రిటన్ ప్రధాని స్టార్మర్-భారత ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ అనంతరం ఈ ఒప్పందంపై మోదీ ప్రకటన చేశారు. ఈ ఒప్పందాన్ని మైలురాయిగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ లాభదాయకమని మోదీ తెలిపారు. గత మూడేళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యం కోసం చర్చలు జరుగుతున్నాయి.
భారత్ నుంచి బ్రిటన్‌కు ఎగుమతయ్యే 99 శాతం ఉత్పత్తులకు ఇకపై సుంకాలు ఉండవు. అంతే కాకుండా బ్రిటన్ నుంచి భారత్‌కు దిగుమతయ్యే విస్కీపై సుంకం తగ్గనుంది. ఈ ఒక్కటే కాకుండా అనేక వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించనుంది.
ఈ ఒప్పందం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారత్--బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచిపోతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. ప్రధాని దౌత్యం వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందని, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలను నెరవే ర్చడంలో కీలకంగా మారనుందన్నారు. ఒప్పందంతో దేశంలోని వస్త్ర పరిశ్రమ, లెదర్ ఉత్ప త్తులు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రంగాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దేశాన్ని పరుగులు పెట్టించేందుకు మోదీ కృషి చేస్తున్నారన్నారు.