12-07-2025 01:33:19 AM
యువతను మద్యానికి దూరంగా ఉంచాలి
రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు
కల్వకుర్తి అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, జూలై 11:నిరుపేదలు వారి పిల్లలను మద్యం, గంజాయి వంటి వ్యసనాల నుండి దూరంగా ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ ప ర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డిలు అన్నారు. నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు విద్యే నిజమైన సంపద అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రారం భించామన్నారు.
రైతులకు సాగునీరు, పేదలకు రేషన్ బియ్యం, విద్యారంగం అభివృద్ధి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఆయన, ఇది ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు.
తాజాగా మాడుగుల, వెల్దండ, కల్వకుర్తి మండలాల్లో రోడ్లు, ఆసుపత్రుల అభివృద్ధికి భారీ నిధులను మంజూరు చేస్తూ శంకుస్థాపనలు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు తక్షణ లాభాలు అందేలా చూస్తున్నామన్నారు. ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుతో కల్వకుర్తి వాసులకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి.
ప్రతిపక్ష టీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధిని గాలికి వదిలేస్తుందని కేవలం ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను చేపడుతుంద న్నారు. నాడు చెల్లని రూపాయి నేడు ఆశేష జనాధారణతో ఎమ్మెల్యేగా గెలిచి నిరుపేదలను సేవలు అందిస్తుందని చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో వైద్య, రోడ్లు-భవనాలు, ఎక్సైజ్ శాఖల మంత్రులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.