calender_icon.png 12 July, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరు ఒక్కరు బాగుపడితే తరాలు బాగుపడతాయి

12-07-2025 01:31:11 AM

  1. పట్టుదలతో చదవండి ఉన్నత స్థానాలకు చేరండి 

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

చిన్న చింతకుంట జూలై 11 : మీరు ఒక్కరు బాగుపడితే మీ కుటుంబంతో పాటు తరతరాలు బాగుపడతాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద వడ్డేమాన్ లో జెడ్పిహెచ్‌ఎస్ హై స్కూల్ లో 20 లక్షల నిధులతో మౌలిక వసతులు, డ్యూయల్ డెస్క్ లు, సైన్సు, కంప్యూటర్ ల్యాబ్ లను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.

విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీచి దిగుతున్నామని తెలిపారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒకటే మార్గమని, విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.

దమగ్నపూర్ గ్రామంలో యాదవుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ 5 లక్షల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.