calender_icon.png 18 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచలన తీర్పు!

18-11-2025 12:09:27 AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం సంచలనం కలిగించింది. గతేడాది జూలై, ఆగస్టు నెలలో బంగ్లా దేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రద్దుకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో 1,400 మంది మృతి చెందగా.. దాదాపు 24 వేల మంది గాయపడ్డారు. 

తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని హసీనానే స్వయంగా ఆదేశాలు ఇచ్చినట్లు తమ విచారణలో వెల్లడైందని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో షేక్ హసీనాను ఉక్కు మహిళగా వ్యవహరిస్తుంటారు. ఒకప్పుడు తిరుగులేని నాయకురాలిగా బం గ్లాదేశ్‌ను పాలించిన షేక్ హసీనా గతేడాది చెలరేగిన అల్లర్లు, ఆందోళనల వల్ల ప్రాణభయంతో దేశం విడిచిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైంది.

అప్పటి నుంచి షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటూ వస్తు న్నారు. ఈ నేపథ్యంలో 1981లో బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన షేక్ హసీనా తన సిద్ధాంతాలు, పోరాటాలతో మూడు దశాబ్ధాలుగా బంగ్లా రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారు. ఆవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హసీనా మొదటిసారి 1996లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో అధికారం కోల్పోయిన ఆమె 2008లో భారీ విజయం అందుకొని సుదీర్ఘ పాలనకు తెర తీశారు.

అప్పటి నుంచి 2024 వరకు బంగ్లాదేశ్‌ను పాలించిన షేక్ హసీనా ఆర్థికంగానూ బంగ్లాదేశ్‌ను మెరుగైన స్థానంలో నిలి పారు.  పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు బంగ్లాదేశ్‌ను వస్త్ర పరిశ్రమ కు కేంద్రంగా మార్చడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించారు. అయితే 2024లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి నిరసనలు షేక్ హసీనా పాలన ముగింపుకు దారి తీశాయి.

ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేయగా, అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. ప్రాణ భయంతో హసీనా దేశం విడిచి  పారిపోవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాను దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఒకప్పుడు యుద్ధా నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు హసీనానే ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ను యూనస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. తాజాగా అదే ట్రైబ్యునల్ నెలల తరబడి విచారణ జరిపి హసీనాకు ఉరిశిక్షను ఖరారు చేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా చూస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారధి మహ్మద్ యూ నస్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమ వుతు న్నారు. అయితే షేక్ హసీనాకు ఐసీటీ కోర్టు మరణశిక్ష విధించడంపై భార త్ స్పందించింది. ఐసీటీ తీర్పును భారత్ గుర్తించిందని, బంగ్లాదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని పేర్కొంది. కనీసం షేక్ హసీనాకు వాదించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కోర్టు తీర్పును వెల్లడించడం గమనార్హం!