18-11-2025 12:00:00 AM
- గజ గజ వణుకుతున్న పల్లెలు
- గణనీయంగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు
- పొగమంచుతో కనపడని పల్లెలు
- బయటికి రావాలంటేనే జంకుతున్న జనం
- ఇబ్బంది పడుతున్న వృద్ధులు, విద్యార్థు లు
- రాత్రి 8 గంటలకే మూత పడుతున్న దుకాణాలు
- వారం రోజులుగా మస్తు చలి
- ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ
మణుగూరు, నవంబర్ 17 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చలి పంజా విసురుతోంది. గతవారం రోజులు గా పలు మండలాల్లో తీవ్రత పెరుగుతూ వచ్చింది. పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగ లు ఎండ.. పొద్దుగూకితే చలితో బయట కు వెళ్లాలంటే జనం వణికి పోతున్నారు.జిల్లాలోని చాలా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తుండడం తో ప్రజ లు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఏజెన్సీ ప్రజలను చలి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీనిపై విజయక్రాంతి కథనం..
ఏజెన్సీలో చలి తీవ్రత..
ఏజెన్సీ మండలాలైన పినపాక, కరకగూ డెం, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లోని గ్రామాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతాలు ఉండడంతో ఇక్కడ ఎముకలు విరిగిపోయేంత స్ధాయిలో చలి తీవ్రత ఉంటుందని ఏజెన్సీ వాసులు చెబుతు న్నారు. సాయం త్రం 5 గంటలు దాటిన ప్రయాణాలకు చలితీవ్రత అడ్డంగా మారు తున్నాయి. వేరే ప్రాంతాల నుంచి ఏజెన్నీ గ్రామాల్లో వాహనాలపై వెళ్ళాంటే బిగుసు కుపోయేంత చలి తీవ్రత ఉంటుంది.
ఉద యం 5 గంటల నుంచి మంచుతో కూడిన చలి గాలులు వీస్తుండటంతో చిన్ని పిల్ల లు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్దులకు రొంపలు, చలి జ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఉద యం సూర్యోదయం కోసం కొందరు చలిని తట్టుకోలేక ఎదురు చూసే పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది.
మంచు కప్పేస్తున్న పల్లెలు...
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండ డంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు కమ్మేస్తున్నది. వారం రోజులుగా పొగ మం చు మూలం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలైనా చలి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇంటిల్లిపాది దుప్పట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇండ్ల పైట్యాంకుల్లో నీళ్లు ఐస్ను తలపిస్తున్నాయి. పగటిపూ ట సూర్యుడు మండుతున్నా ప్రజలు నీడ కు రావడం లేదు. ఉదయం 9గంటలకు కూడా చలి తగ్గకపోవడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతు న్నారు. విధుల నిమిత్తం ఇతర ప్రాంతాల కు ప్రయాణం చే స్తున్న ఉద్యోగులు, మా ర్నింగ్ వాకింగ్ చేసేవారు, రైతులు, కూలీ లు, కార్మికులు, వ్యా పారులు గరం కోట్లు ధరించకుండా బయటికి రావడం లేదు. పాలు, కూరగాయల వ్యాపారులు, పేపర్ బాయ్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
8 గంటలకే మూత పడుతున్న దుకాణా లు
చలి కారణంగా ప్రజల రోజువారీ పనులపై ప్రభావం పడుతోంది. తెల్లవారుజా మున ఐదు గంటల నుంచే మొదలయ్యే పాల వ్యాపారులు, హోటల్ నిర్వాహకుల దిన చర్య ఆరున్నర తర్వాత షురూ అవుతోం ది. రాత్రికూడా దుకాణాలు త్వరగా మూ తపడుతున్నాయి. మణుగూరు, పినపా క, అశ్వాపురం, కరకగూడెం ప్రాంతాలలో రాత్రి పది గంటల వరకు వాణిజ్య సము దాయా లు, షాపులు తెరిచి ఉండేవి. ఇ ప్పుడు చలి కారణంగా జనం రాకపో వ డంతో తొమ్మిది గంటల వరకే బంద్ చే యాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలు సైతం చాలా తగ్గాయి.
ఉన్ని దుస్తులకు పెరిగిన డిమాండ్..
చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులకు మంచి గిరాకీ పెరిగింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు రగ్గులు, స్పెట ర్లు, మంకీ క్యాప్లు కొనుగోలు చేసు కుంటున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వ్యాపా రులు మణుగూరు లోని అంబేద్కర్ సెంట ర్, సురక్ష బస్టాండ్, ఏరి యాలలో ప్రధాన రహదారిపై స్వెట్టర్లు, రగ్గులు, దుప్పట్లు విక్రయిస్తున్నారు. రోడ్ల ప్రక్కల దుకాణాలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత వరకు ఇక్కడే అమ్మకాలు కొనసాగిస్తుంటారు.
తొలుత చలి తీవ్రత లేకపోవ డంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, గత 15 రోజుల రోజుల నుంచి అమ్మకాలు జోరందుకున్నాయని దుకాణాదారులు చెబుతున్నారు. మరోవైపు సా యంత్రం ఐదు గంటలకే ఎముకలు బిగిసేంత స్ధా యిలో ఉన్న చలికి వాహనాలపై ప్రయా ణించలేకపోతున్నారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్ధితుల్లో తప్ప ఎవరూ కూడా గ్రామాలను దాటి రావడం లేదు. బయట పనులను ముగించుకుని వెంటనే ఇళ్ళల్లోకి తుర్రు మంటున్నారు.