18-11-2025 12:00:00 AM
చేవెళ్ల, నవంబర్ 17 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చేవెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. నాడు ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర చేపట్టి దేశ చిత్రపటంలో నిలిపారు. అంతేకాదు ఎందరో అమాత్యులుగా ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. కానీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా వైద్యసేవలు అగమ్యగోచరంగా ఉన్నాయి.
చేవెళ్ల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే పెద్ద దవాఖానా. కానీ సదుపాయాలు మెరుగుపడటం లేదు. చేవెళ్ల పట్టణ కేంద్రం రోజురోజుకు విస్తరిస్తున్నది. దాదాపు హైదరాబాద్ నగరంను మరో నాలు ఐదేళ్ళలో కలిసిపోనున్నది. ఈ చేవెళ్ల మీదుగానే హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారివెళు తుంది. ముఖ్యంగా చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలతో పాటు కర్ణాటక రాష్ట్రాన్ని కూడా ఈ రహదారి అనుసంధానం చేస్తుంది.
దశాబ్దాలుగా రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో వందల మంది రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడటం, వేలాది మంది క్షతగాత్రులవుతున్నారు. అదేవిధంగా చేవెళ్ల పట్టణ ప్రాంతం విస్తరిస్తుండటంతో వేలాది మంది ఉపాధి అవకాశం కోసం బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. దీనికి తోడు స్థానికంగా ఉండే ప్రజలు ప్రతినిత్యం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
అయితే ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగడం, అనారోగ్యంతో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. కాగా, చేవెళ్లలో సరైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడటం జరుగుతు న్నది. క్షతగాత్రులకు వైద్యం అందక దివ్యాంగులు గా మారుతున్నారు. ప్రసూతి సేవల కోసం గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు సైతం ప్రతినిత్యం ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి కూడా సరైన వైద్యం అందడం లేదు. పై సమస్యలపై ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేయగా, ప్రభు త్వాల దృష్టికి తీసుకువెళ్లారు.
నిధులు మంజూరైనా..
2023లో చేవెళ్ల ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేశారు. భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం రూ.17.5 కోట్లు మంజూరు అయ్యాయి. అన్నీఉన్నా అల్లుడు నోట్లో శని అన్న విధంగా ఆస్పత్రి నిర్మాణం కావడం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు వంద పడకల ఆస్పత్రి కలేనా అన్నట్లుగా తయారైంది. నిధులు మంజూరై రెండు ఏళ్ళు పూర్తి అవుతున్న పునాది రాయి పడs పోవడం శోచనీయంగా మారింది. వైద్యఆరోగ్య శాఖలో పై నిధులు ఓ మూలాన మూలుగుతున్నా యి.
కాగా, చేవెళ్లతో పాటు పరిగి, షాద్నగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చేవెళ్ల కంటే ఎక్కువగా నిధులు విడుదల చేసి ఆయా ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా నాటి ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఆ ప్రాంతాల్లో నాడే నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్పత్రులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. కాని చేవెళ్ల ఆస్పత్రికి మాత్రం పునాది రాయి పడలేదు. ఆసుపత్రి నిర్మాణం పూర్తితే 40మంది వైద్యులు, 60మంది వైద్య, వైద్యేతర సిబ్బంది, మెరుగైన వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. 119 నియోజకవర్గాల్లో 100 పడకలు లేని ఆస్పత్రి చేవెళ్లదే కావడం గమనార్హం.
స్థల అన్వేషణకు తిప్పలు..
చేవెళ్ల 100 పడకల ఆస్పత్రి కేవలం కాగితాలకే పరిమితమైంది. నిర్మాణం విషయం లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణానికి ఎందుకు జాప్యమవుతుంద ని ప్రశ్నిస్తే, నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కావా లి. చేవెళ్లలో ఆ స్థలం లభ్యం కావడం లేదని పాలకులు, అధికార యంత్రాంగం పేర్కొంటోం ది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ఆస నిర్మాణంనకు స్థలం లభించడం లేదంటే ప్రజ తా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎకరాల కొద్ది కబ్జాలకు గురవుతూ ఆస్పత్రికి స్థలం లభించకపోవడం గమనార్హం.
ట్రామా కేర్ ఏర్పాటు చేయండి
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ని వెంటనే నిర్మిoచాలి.2023 లో నిధులు మంజూరైనా ఇప్పటి కి పునాది రాయి వేయకపోవడం దారుణం. చేవెళ్ల-హైదరాబాద్ ప్రధాన రహదారి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ సైతం ఏర్పాటు చేయాలి. గతం ఇక్కడ పురుగుల మందు తాగి ఆత్మ హత్య లు చేసుకునేవారు. ప్రస్తుతం అవి తగ్గి.. నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణం వెంటనే చెప్పటాలి.
- -కృష్ణ, స్థానికుడు
ఆస్పత్రి నిర్మాణంపై పాలకుల అలసత్వం..
చేవెళ్లలో వంద పడకల ఆసుపత్రిని నిర్మాణంలో గత పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. గత 50 ఏళ్ళుగా చేవెళ్లను పాలిం చిన పాలకులు వారి వ్యక్తిగత ఆస్తులు, పరపతి పెంచుకున్నారే తప్ప, వైద్య, విద్య సేవలందించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. గత సోమవారం చేవెళ్ల ప్రాం తంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19మంది మృత్యువాత పడటంతోపాటు 35మందికి పైగా గాయాలయ్యాయి. వంద పడకల ఆస్ప త్రి అయితే వైద్య సకాలంలో సరైన వైద్యం అందేది.
ఇప్పటికైన పాలకులు అలసత్వం, నిర్లక్ష్యం, నిర్లిప్తత వీడి వెంటనే వంద పడకల ఆస్ప నిర్మాణం గావించాలని సీనియర్ వైద్యుల ఎముకల వైద్య నిపుణులు, భారతీయ జన పార్టీ జిల్లా యువ నాయకులు మల్గారి వైభవ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ఇంకా ప్రారంభం కాని ఏకైక నియోజకవర్గం చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే..! రాష్ట్రంలోని ఉన్న 118 నియోజకవర్గాలలో 100 పడకల ఆసుపత్రులు నిర్మాణం పూర్తు, ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, చేవెళ్ల నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.
మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 19 మంది మృతి చెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడిన ఘటన ఈ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ప్రస్తుతం చేవెళ్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సామర్థ్యం తక్కువగా ఉండటంతో, గాయపడిన వారిని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ కు తరలించాల్సి వచ్చింది.
2023 ఆగస్టులోనే 100 పడకల ఆసుపత్రి అనుమతి లభించినప్పటికీ, ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎవరి నిర్లక్ష్యంతో ఈ స్థితి ఏర్పడింది? ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ప్రభుత్వ వైద్య వసతులను నిర్లక్ష్యం చేయడం అసహ్యకరం. చేవెళ్లకు న్యాయం చేయాలి. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే నిర్మించాలి అని కోరారు.
బీజేపీ యువ నాయకుడు, మల్గారి వైభవ్ రెడ్డి