23-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల ఆగస్టు 22 : ప్రజల సంక్షేమం లక్ష్యంగా అలుపెరుగని సంక్షేమం దిశగా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూ దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అడ్డాకుల మండల కేంద్రంలోని మండల పరిషత్ కా ర్యాలయంలో ప్రజా పాలన ప్రభుత్వం పను ల జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మా ట్లాడుతూ . బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ని యోజకవర్గం అభివృద్ధికి నోచుకోలే దని పేర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ సప్లై ప్రతి గ్రామంలో రూ 20 లక్షల మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.
గత పాలకుల విధానాల మూలం గా రాష్ట్రంలో ఖజాన లోటు బడ్టెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు డోకా లేకుండ కల్పి స్తున్న ఘనత తమదన్నారు. ప్రజలకు ఉపా ధి కల్పనతో పాటు గ్రామ అభివృద్ధితో భాగంగా తెలంగాణ లో అన్ని జాతర కార్యక్రమం కీలక మైలు రాయిగా నిలుస్తుందన్నా రు.
అడ్డాకుల మండలంలోని అడ్డాకుల రామచంద్రపు, రాచాల, గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎన్ ఆర్ ఈ జి ఎ స్ ద్వారా మంజూరైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్ తోపాటు రూ 13, 34, 988 లను స్వ యం ఉపాధి ద్వారా పశువులు పెంపకం సంబంధించిన షెడ్యూల్ యూనిట్లను, గొర్రె ల పెంపకం సంబంధించిన యూనిట్లను, కోళ్ల పెంపకం సంబంధించిన ప్రోటీన్లను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ శేఖర్, ఎంపీడీవో సద్దుణ, మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, నాగిరెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.