calender_icon.png 16 September, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది

16-09-2025 12:15:12 AM

సిద్దిపేట జిల్లా ఏబీవీపీ కన్వీనర్ ఆదిత్య

సిద్ధిపేట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి):గురుకుల పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సిద్దిపేట జిల్లా ఏబీవీపీ కన్వీనర్ ఆదిత్య అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ. 21 నెలల కాంగ్రెస్ పాలనలో కళాశాలలను స్వయంగా యాజమాన్యాలే బంద్ చేయడం ఇది రెండోసారి అని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. విద్యార్థులకు ఫీజు చెల్లించాలని అడిగితే ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం భాధాకరమన్నారు.

పెండింగ్ లో ఉన్న ఫీజు రి యింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ 21 నెలల కాలంలో 75 మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 8,500 కోట్ల కు పైగా ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని, కళాశాలలు బంద్ చేయడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థుల పై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నా రు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని, ఫీజు రియింబర్స్ మెంట్ తో పాటు పెండింగ్ లో బిల్లులు చెల్లించాలని లేకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ భాను ప్రసాద్, జోనల్ ఇంచార్జ్ అనీష్, నగర ఉపాధ్యక్షులు లోకేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.