16-09-2025 12:13:59 AM
జహీరాబాద్, సెప్టెంబరు 15 :తెలంగాణ, కర్ణాటక సరిహద్దు వద్ద గల చిరాగ్ పల్లి చెక్ పోస్ట్ వద్ద 8 గ్రాముల చారస్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. గోవా నుండి కారులో మాదక పదార్థమైన చారస్ ను హైదరాబాదు కు తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయగా బయటపడింది. ఢిల్లీకి చెందిన డిఎల్10 సిపి 8245 నంబర్ గల జీపులో తరలిస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు. మెదక్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్, నవీన్ చంద్ర సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ పొల్యూషన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు సోమవారం తనిఖీలు నిర్వహించారు. చారస్ తో పాటు జీప్ను స్వాధీనం చేసుకొని నిందితుడు అమర్జిత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.