calender_icon.png 10 July, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిబాబా ఆలయం

09-07-2025 10:14:31 PM

చైర్మన్ నల్లపాటి నర్సింహారావు..

కోదాడ: కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామ పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులోని సాయిబాబా ఆలయం(Sai Baba Temple) గురుపౌర్ణమికి ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గురుపౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం నుంచి విశేష పూజలు, అర్చనలు జరుగుతాయని చైర్మన్ నల్లపాటి నర్సింహారావు తెలిపారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.