calender_icon.png 10 July, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

09-07-2025 10:22:11 PM

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి...

హనుమకొండ (విజయక్రాంతి): బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ అలాగే ఆత్మకూరు మండల కేంద్రంలో ఆత్మకూర్, దామెర మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 4,030 మందికి 27 కోట్ల 63 లక్షల 72 వేల 700 రూపాయలు అందజేశామన్నారు. ఇందులో కళ్యాణలక్ష్మి ద్వారా 1950 మందికి 19 కోట్ల 52 లక్షల 26 వేల 200 రూపాయల ఆర్థిక సహాయం, సీఎంఆర్ఎఫ్ ద్వారా 1994 మందికి 6 కోట్ల 39 లక్షల 33 వేల రూపాయలు అందజేశామన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి అని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.

గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ వాటిని కూడా మంజూరు చేశామని అన్నారు. పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిలుస్తుంది అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఏకకాలంలో రైతు రుణమాఫీ, పేద ప్రజలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న వడ్లకు రూ 500 బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అంచలంచలుగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు  అధికారులు, లబ్ధిదారులు  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.