calender_icon.png 9 October, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తవడం ఖాయం

09-10-2025 12:00:00 AM

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 

కొండాపూర్, అక్టోబర్ 8 : కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్థంగా మారాయని, స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జోష్యం చెప్పారు. బుధవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో మల్లెపల్లి మాజీ సర్పంచ్ శివలీల జగదీశ్వర్లు కాంగ్రెస్ పార్టీని వీడి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలన్నారు. మాజీ సర్పంచ్ శివలీల జగదీశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అభివృది లేదని, గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు గుర్తింపులేదన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మానిక్యం, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, పాండురంగం, గోవర్దన్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, రుక్మోద్దీన్, రాందాస్, నగేశ్, మల్లేశం, ఫహీం, నర్సింలు, ప్రేమానందం,మల్ల గౌడ్,రామ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.