09-10-2025 12:00:00 AM
- నిబంధనలకు తూట్లు
- హోటళ్లకు, దాబాలకు నిత్యం సరఫరా
- మామూళ్ల మత్తులో అధికారులు
బెజ్జంకి, అక్టోబర్ 8:గృహ అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందించే స బ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు బెజ్జంకి మండలంలో పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నా యి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని నిబంధ నలు స్పష్టంగా చెబుతున్నా, మండలంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగం బహిరంగంగా సాగుతోంది. హోటళ్లు, దాబా లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కర్రీ పా యింట్లు, పర్మిట్ రూములు ఇలా దాదాపు అన్ని వాణిజ్య సంస్థల్లో గృహ అవసరాల సిలిండర్లే వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సాధారణంగా వాణిజ్య గ్యాస్ సిలిం డర్ (కమర్షియల్) ధర 19 కేజీలకు రూ. 1905 కాగా, గృహ వినియోగ గ్యాస్ (డొమెస్టిక్) ధర 14.2 కేజీలకు రూ.924.50 మాత్ర మే. ఈ భారీ ధర తేడా కారణంగా వ్యాపారులు కమర్షియల్ సిలిండర్ల బదులు డొమె స్టిక్ సిలిండర్లను వినియోగిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది ఈ దందాకు తోడ్పాటుగా వ్య వహరిస్తున్నారని వినియోగదారులు తీవ్రం గా ఆరోపిస్తున్నారు.
అక్రమ వ్యాపారం పుష్పిస్తోంది
బెజ్జంకి మండల కేంద్రం తో పాటు పరిసర గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కె ట్ జోరుగా సాగుతోంది. ఏజెన్సీలు రోజుకు పదుల సంఖ్యలో సబ్సిడీ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నారని సమాచారం. గృహ వినియోగదారులు ఆన్లైన్లో బుకింగ్ చేసినా మూడు నుండి నా లుగు రోజులు ఆలస్యంగా సిలిండర్ అందుతుండగా, అదే సమయంలో హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు అదే రోజున సరఫరా అవుతుండటం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.
గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు రెండు రోజుల్లో సిలిండర్ అందించాల్సి ఉ న్నా, ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధర కు విక్రయించేందుకు ఉద్దేశపూర్వకంగా ఆల స్యం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాక, డోర్ డెలివరీ సిలిండర్లకు రూ.924 వసూలు చేయాల్సి ఉండగా, అదనంగా రూ.50 నుండి రూ.60 వరకు వసూలు చేస్తున్నట్లు ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వాణిజ్య గ్యాస్ బదులు సబ్సిడీ సిలిండర్లు
మండలంలో ఉన్న హోటళ్లు, దాబాలు వారానికి కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగిస్తాయి. ఒక కమర్షియల్ సిలిండర్ బదులుగా రెండు డొమెస్టిక్ సిలిండర్లు తీసుకుంటే తక్కువ ఖర్చుతో సరిపోతుందని వ్యాపారులు భావిస్తున్నారు. గ్యా స్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని లాభదాయకంగా మార్చుకొని ఒక్కో సిలిండ్ప రూ.200 నుం డి రూ.300 వరకు అదనంగా వసూలు చే స్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం
భారత పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హెచ్పీ గ్యాస్ కంపెనీల నియమాల ప్రకారం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. డొమెస్టిక్ గ్యాస్ను వ్యాపార అ వసరాలకు వినియోగించడం చట్టపరంగా నే రం. వాణిజ్య సంస్థలు కచ్చితంగా కమర్షియ ల్ గ్యాస్ సిలిండర్లను మాత్రమే వాడాలి. స బ్సిడీ గ్యాస్ను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడితే రూ.10,000 వరకు జరిమానా లే దా జైలుశిక్ష విధించవచ్చు. ఏజెన్సీలు అక్రమంగా సిలిండర్లు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చే యడం, నేరపరమైన చర్యలు తీసుకోవడం నిబంధనల్లో ఉంది. అయిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి బ్లాక్లో విక్రయిస్తున్న పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించాలి
మండలంలో సబ్సిడీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్యాస్ సరఫరా వాహనాలు కూడా ఏజెన్సీ పేరుతో కాకుండా గుర్తింపు లేకుండా తిరుగుతున్నాయి. అధికారులు ఈ దందా ప ట్ల కనీసంగా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.తహసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడు తూ, బ్లాక్లో అమ్ముతున్న సిలిండర్లను గుర్తిం చి పౌర సరఫరాల శాఖతో కలిసి చర్యలు తీ సుకుంటాం. డొమెస్టిక్ గ్యాస్ దుర్వినియోగం జరగకుండా కఠినంగా పర్యవేక్షణ చేపడతమన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహక రించి ఇలాంటి అక్రమాలను బహిర్గతం చేయాలని కోరారు.