18-10-2025 01:28:05 AM
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మాగనూరు, మక్తల్. అక్టోబర్ 17. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల కు న్యాయం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ లో చేప పిల్లలను విడుదల చేసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు డాక్టర్ దామోదర రాజ నరసింహ, డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ ప్రాంతము వెనుకబాటు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగినది అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మత్స్యశాఖ కేటాయించడం దేశంలో నే మొదటిసారిని మంత్రి డాక్టర్ దామోదర రాజ నరసింహ అన్నారు. ఇ మి నీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసం పనులు దాదాపుగా నాలుకోట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యొక్క పనులను కూడా టిఆర్‌ఎస్ నాయకులు అ డ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
మన నారాయణపేట జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం కోసం రెండు ఆస్పత్రులు మంజూరు చే యడం జరిగినదని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఎమ్మెల్యే లు,కలెక్టర్ సీక్త పట్నాయ, జిల్లా ఎస్పీ, రాష్ట్ర, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులుపాల్గొన్నారు.