18-10-2025 01:29:09 AM
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యామ్ రోడ్ల కు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలుపడంతో నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 30 నెలల్లో రోడ్లు నిర్మించి 15 ఏళ్లు నిర్వహించాలని అందులో అధికారులు పేర్కొన్నారు. తొలి విడతలో రూ.6,294 కోట్ల వ్యయంతో 2,162 రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.