14-09-2025 12:08:16 AM
కామారెడ్డిలో ఘటన
కామారెడ్డి, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో నవజాత శిశువు శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడికి చెందిన అఖిలకు శుక్రవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అఖిల నొప్పులు భరించలేక పోతుందని ఆపరేషన్ చేసి పాపను తీయాలని వైద్యులకు సూచించినా వారు సాధారణ కాన్పు చేసేందుకు మొగ్గు చూపారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నవజాత శిశువు మృతి చెందినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా శిశువు ఉమ్మ నీరు పీల్చుకోవడం వల్లనే మృతి చెందినట్లు తెలిపారు.