calender_icon.png 14 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా పదవే ఉంటదో ఊడ్తతో తెల్వదు!

14-09-2025 12:49:19 AM

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా డైలామాలో పడ్డారు. ఒకవేళ బీఆర్‌ఎస్ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కితే ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కొంతమందిపై అనర్హత వేటు తప్పేలా లేదు. ఈ క్రమంలో వారు ఎటు తేల్చుకోలేక తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, సాగుకు అవసరమయ్యే యూరియా కొరత వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై సదరు ఎమ్మెల్యేలు మా పదవులే ఉంటాయో, ఊడుతయో తెలియని పరిస్థితిలో ఉన్నామని, ఇంకా మీ సమస్యలను ఎలా పరిష్కరించాలని సమాధానమిస్తున్నారని సమాచారం. అది కూడా నిజమే.. వాళ్లకే దిక్కులేదు.. మనల్ని ఎవరు పట్టించుకుంటారని ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.