calender_icon.png 14 September, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగల్ దంగల్

14-09-2025 12:00:00 AM

ఇయర్ ఎండింగ్ దగ్గర పడుతోంది. సంక్రాంతి సమీపిస్తోంది. దీంతో రిలీజ్ డేట్ ప్రకటిస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పండగ ప్రత్యేక చిత్రాలపై సగటు సినీజీవికి ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. నిరుడు ఇండస్ట్రీ ఏకమై ఒక్కమాటగా అనుకున్నన్ని సినిమాలనే రిలీజ్ చేశారు. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదే అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశం. మొత్తంగా ఈసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో పొంగల్ ఫెస్టివల్ కోడి పందేలను మించే దంగల్‌ను తలపించేలా ఉంది. 

సంక్రాంతి పండుగ తెలుగు చిత్రసీమకు ప్రత్యేకం. ఓ రకంగా చెప్పాలంటే, ఈ పండక్కి సినిమాలు విడుదల చేయడమనేది తెలుగు ఇండస్ట్రీలో సంప్రదాయంగా మారింది. అందుకే తమ సినిమా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం వస్తే బాగుం టుందని కోరుకోని మేకర్ టాలీవుడ్‌లో ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఏటా సం క్రాంతికి కనీసం నాలుగు సినిమాలైనా విడుదలవుతుంటా యి. వచ్చే సంక్రాంతికి ఇంకా నాలుగు నెలకుపైనే సమయం ఉం ది. కానీ, అప్పుడే చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకుంటున్నాయి. దీంతో సంక్రాంతి సినిమాల జాబితా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 

కొబ్బరికాయ కొట్టినప్పుడే ప్రకటించి..  

ఈ ఏడాది సంక్రాంతి ‘సంక్రాంతికి వస్తు న్నాం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈసారి పండక్కి ‘మెగా 157’తో రానున్నట్టు ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టడంతోనే ప్రకటించారు. అలా బెర్త్ ఖాయం చేసుకున్న ఈ చిత్రం 2026, జనవరి 12న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

ఇటీవల ఈ చిత్ర కథానాయ కుడు చిరంజీవి పుట్టిన రోజున ‘మన శంకరవరప్రసాద్ గారు’గా టైటిల్ ప్రకటించారు. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా నయనతార నటిస్తుండగా, వెంకటేశ్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. 

ఎన్నో వాయిదాల తర్వాత ‘రాజాసాబ్’ 

ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ కూడా సంక్రాం తికే వస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ కొద్ది నెలల క్రితమే ప్రకటించి నప్పటికీ నిర్మాణానంతర పనులు పూర్తి కానందున మళ్లీ వాయిదా పడింది. చివరికి సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ ఇందులో అలరించనున్నారు. 

మాస్ మహారాజ రాక ఖాయం  

తాజాగా ఈ బరిలోకి రవితేజ దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుంచే సంక్రాంతి లక్ష్యంగా చిత్రీకరణ పనులు జరుపు కొన్న ఈ సినిమా ఇటీవల సినీకార్మికుల సమ్మెల కారణంగా కాస్త ఆలస్యమైంది. తాజా సమాచా రం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవడం ఖాయమేనట. జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటిం గ్ నిర్వహిస్తున్న టీమ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుందట. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రంగంలోకి దిగాలన్న ఆలోచనతో ఉందట చిత్రబృందం. ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ ప్రచారం లో ఉండగా మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నిరుడు పండగ బరిలో నుంచి హీరో రవితేజ స్వతహాగా తప్పుకొని ఇండస్ట్రీ ఆర్థిక కష్టాల్లో పడకుండా కాపాడారు.

మానవతా దృక్పథం తో గత ఏడాది తన సినిమాను వాయిదా వేసుకున్న మాస్ మహారాజ ఈసారి పండక్కి వస్తానంటే అడ్డు చెప్పేవారు ఉండరనే అభిప్రా యం అందరిలో వ్యక్తమవుతోంది. మరో వైపు రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే నిజమైతే మాస్ మహారాజ.. రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించటం ఖాయమని తెలుస్తోంది.