calender_icon.png 26 December, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళపై కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు!

26-12-2025 01:35:54 AM

  1. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
  2. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  3. బాన్సువాడ పట్టణంలో ఘటన

బాన్సువాడ, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బా న్సువాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు అనుచరుడు బోర్లంకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి మహిళను వేధిస్తున్న సమయంలో గురువారం ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం నిందితుడిని ఆస్పత్రి నుంచి రోడ్డుపైకి తీసుకువచ్చి కొడు తూ బాన్సువాడ పోలీస్ స్టేషన్ వర కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనగా, సం బంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘట నపై బాన్సువాడ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై సీఐ శ్రీధర్‌ను వివరణ కోరగా మాజీ ప్రజా ప్రతినిధి దేవేందర్ రెడ్డిపై మ హిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.