08-01-2026 01:02:43 AM
నిజామాబాద్, జనవరి 7 (విజయ క్రాంతి): నిజామాబాద్. కాంగ్రెస్ నేత సునీల్‌రెడ్డికి బేయిల్ మంజూరు కావడంతో న్యాయపరంగా వచ్చిన సమస్యలు ఆయన పోరాట లభించింది. కాంగ్రెస్ నాయకుడు సునీల్‌రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సునీల్‌రెడ్డి పై జిఎస్టి ఎగవేత. ఆయనకు కేసును అధికారులు నమోదు చేశారు.
ఈ కేసులోనాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్‌రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఆయన కొనసాగుతున్నారు. రాష్టవ్యాప్తంగా పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించడానికి డీజీజీఐ అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగా సునీల్‌రెడ్డి రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని గుర్తించారు. మూడు నెలల గడువు ముగిసినా జీఎస్టీ చెల్లించకపోవడంతో ఆయన జీఎస్టీ చట్టం 2017 ప్రకారం అరెస్ట్ చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేశారని, దానిని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు నమోదు చేసిన కేసులో పేర్కొన్నారు.
సునీల్ రెడ్డికి రూ.5 లక్షల జమానతు పై కోర్టు బెల్ మంజూరు చేసింది. జీఎస్టీ అధికారులు తనని అరెస్ట్ చేయడం పై సునీల్‌రెడ్డి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టుకు ఆయన ఊరటనిచ్చింది. జీఎస్టీ ఎగవేత కేసులో బెయిల్ మం జూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. మరోవైపు జీఎస్టీ ఎగవేత కేసులో ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ ఎన్ సైతం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.