calender_icon.png 10 January, 2026 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి సహకారంతో గ్రామాభివృద్ధి

09-01-2026 05:37:04 PM

పెంచికల్ పెట్,(విజయ క్రాంతి): అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఎలుక పల్లి సర్పంచ్ భక్తురాంచందర్ అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీలో  మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పలు సమస్యలను గ్రామసభలో ప్రస్తావించగా సర్పంచ్ స్పందించి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిల్ కార్యదర్శి చంద్రశేఖర్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.