calender_icon.png 10 January, 2026 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే ఊరుకోం: తలసాని శ్రీనివాస్ యాదవ్

09-01-2026 04:19:50 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును రూపు మాపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యే లు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పోరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్, పలువురు కార్పొరేటర్ లు, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యులు, పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ద్వజమెత్తారు. డివిజన్ ల విభజన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీస్ లలో కూర్చొని గూగుల్ మ్యాప్ ల ఆధారంగా ఏర్పాటు చేశారని వివరించారు. 150 డివిజన్ లు ఉంటే 300 కు పెంచి హైదరాబాద్, మల్కాజ్ గిరి, సైబరాబాద్ పేరుతో మూడు మున్సిపల్ కార్పోరేషన్ లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.

సికింద్రాబాద్ పేరుతో మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసే వరకు  దశల వారీగా అనేక ఆందోళన కార్యక్రమాలు అహింసా మార్గంలో  నిర్వహిస్తామని  చెప్పారు. ముందుగా  ఈ నెల  11 వ తేదీన ఉదయం 11 గంటలకు బాలం రాయ్ లోని  లీ ప్యాలెస్ లో  సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, చరిత్ర, సంస్కృతి ని కాపాడుకునేందుకు జరిపే పోరాటానికి  కలిసొచ్చే అన్ని రాజకీయ  పార్టీలు, అన్ని వ్యాపార, వాణిజ్య,  కార్మిక, కుల సంఘాలు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు, సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.

11వ తేదీన నిర్వహించే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నట్లు తెలిపారు.  17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుండి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సర్కిల్  ల మీదుగా MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం  వరకు 10 వేల మందితో  భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.  ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్  ను ముట్టడిస్తామని చెప్పారు.  అవసరమైతే బంద్ లు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సెక్రేటరీయేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కి దమ్ము ఉంటే హైదరబాద్  పేరు మార్చాలని సవాల్ చేశారు.

220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరుతో కాకుండా వేరొక పేరుతో కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో  కార్పొరేటర్  లు  కోలన్ లక్ష్మీ, టి. మహేశ్వరి,   కూర్మ  హేమలత, సామాల హేమ, ప్రసన్నలక్ష్మి, కంది శైలజ, రాసూరి సునీత,  మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శాదం బాలరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు కోలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్,  ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్,  వెంకటేశన్ రాజు,  నాయకులు  తలసాని స్కై లాబ్ యాదవ్,  నాగులు,  కిషోర్ కుమార్, శ్రీహరి, నరేందర్, మహేష్ కుమార్ యాదవ్,  ఆంజనేయులు, శేఖర్ తదితరులు  ఉన్నారు.

పలు సంఘాల  మద్ధతు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం నిర్వహించే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ను తెలుపుతూ పలు సంఘాల ప్రతినిధులు తమ తీర్మాణాలను ఎమ్మెల్యే లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ లకు  అందజేశారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యం లో  ఏర్పాటు చేసిన సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 35  కు పైగా వ్యాపార, వాణిజ్య, కార్మిక, కుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ సందర్బంగా  పలువురు ప్రతినిధులు  మాట్లాడుతూ  సికింద్రాబాద్ ప్రాంత వాసులుగా  ఇక్కడే పుట్టి పెరిగామని,  మా అస్తిత్వాన్ని  దెబ్బ తీస్తామంటే  ఊరుకునేది లేదని  స్పష్టం చేశారు.  తలసాని  శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో నిర్వహించే అన్ని పోరాటాలలో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, పార్టీ లను కలుపుకొని…