09-01-2026 05:30:00 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): రామడుగు మండలంలోని వెదిర గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్ ను, ఉప సర్పంచ్ దుగ్యాల రాజిరెడ్డిని వాగేశ్వరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిని సర్పంచిగా ఎన్నుకున్న వెదిర గ్రామ ప్రజల నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామాన్ని అన్ని రంగాల్లో విద్య, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసే సామర్థ్యం కలిగి వ్యక్తి అని, అంతే కాకుండా ప్రజల సహకారం, ఐక్యతతో గ్రామం మరింత ప్రగతి సాధిస్తుందని, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తే సమాజాభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. తదుపరి సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఘన విజయం అందించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరి సహకారంతో వెదిర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు.