09-01-2026 04:22:26 PM
సర్పంచ్ కుంచాల శ్రీనివాసరెడ్డి
గెలిచిననాడు నుండి నేటి వరకు అన్నారం గ్రామం దిన దిన అభివృద్ధి
తుంగతుర్తి,(విజయక్రాంతి): అన్నారం గ్రామ ప్రజలకు గత నెలలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన ఎన్నికల హామీ మేరకు శుక్రవారం ఫ్రీజర్ బాక్స్ ను గ్రామపంచాయతీకి అందజేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన వారిని భద్రపరచడానికి ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్ ను (డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్) నా గ్రామ ప్రజలు పేదలు మరణిస్తే వారిపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం
ఒక నెల రోజుల వ్యవధిలోనే మా గ్రామ ప్రజలకు కీర్తిశేషులు కుంచాల వెంకట్రామిరెడ్డి మా తండ్రి జ్ఞాపకార్థం ఎన్నికల్లో నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. ఫ్రీజర్ బాక్స్ ను గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ని గ్రామ ప్రజలు అభినందించారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు నేటి వరకు ఒక్కొక్కటి అభివృద్ధి కొనసాగుతుండడంతో, గ్రామ ప్రజలు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.