09-01-2026 05:18:15 PM
మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్యూం
బిచ్కుంద,(విజయ క్రాంతి): బిచ్కుంద మండలం ఓటర్ల జాబితా వార్డుల వారీగా మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఓటరు జాబితాలో ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న పదో తారీకు లోపల దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 16వ తేదీన తుది ఫోటో ఆధారిత ఓటర్ జాబితా తయారు చేయడం జరుగుతుందని బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్యూం అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితా ఈనెల 16లోగా తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఫోటో ఆధారిత ఓటర్ జాబితా వార్డుల వారీగా సవరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... ప్రజల నుండి ఇప్పటివరకు 92 ఫిర్యాదులు అందాయని అందులో 57 ఫిర్యాదులు వార్డుల వారిగా సవరించడం జరిగిందని మిగతావి పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారుల వద్ద తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు శివాని, వీరారెడ్డి, విశాల్, కంప్యూటర్ ఆపరేటర్ సంజీవ్ అధికారులు ఉన్నారు.