09-01-2026 05:33:05 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి వార్డు మెంబర్స్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పనులను గ్రామ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ ఈజీఎస్ పనులకు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించి పేరు నమోదు చేసుకొని పనులకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నూతన జిపి పాలకవర్గం ప్రతినిధులతో పాటు గ్రామ కూలీలు పాల్గొన్నారు.