calender_icon.png 10 January, 2026 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను వ్యర్ధాల కేంద్రాలలో అందజేయాలి

09-01-2026 05:54:08 PM

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ కమీషనర్  ఆదేశాల మేరకు  బోడుప్పల్ సర్కిల్ యందు అన్ని వార్డులలో ఎలక్ట్రానిక్  వ్యర్థలు (ఈ-వేస్ట్) సేకరిస్తునట్లు డిప్యూటీ కమీషనర్  ఎ.శైలజా తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 12,13 తేదీలలో ప్రజలందరూ తమ ఇళ్లు, కార్యాలయములలో ఉన్న ఎలక్ట్రానిక్  వ్యర్ధాలను  ప్రతి  కాలనీలోనీ  వ్యర్థల  సేకరణ కేంద్రాలలో పనిచేయని రిఫ్రీజీరేటర్స్, వాషింగ్ మెషిన్లు, ఏసిలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టి.విలు, పవర్ బ్యాంక్ లు, బ్యాటరీలు, కేబుల్ లు, మానిటర్లు, ప్రింటర్లు, డిజిటల్ కెమెరాలు, స్విచ్లు, స్మార్ట్ వాచీలు, మిక్సీలు, గ్రేయిన్డర్లు,  ప్యాన్లు, కూలర్లు, హీటర్లు తదితర ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు అందచేయవచ్చన్నారు.

సరి అయిన నిర్వహణ ద్వారా పర్యావరణం పరిరక్షించ వచ్చునని, నగర ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో డి. ఇ. ఇ.  కె. జాహ్నవి శశాంక్, ఎ. ఇ. మహేష్, ఎస్ డబ్ల్యూ ఎం.  డి మహేష్ సానిటరీ ఇన్స్పెక్టర్  ప్రవీణ్ కుమార్, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ భార్గవి, ఎన్విరన్మెంటల్  ఇంజనీర్స్ బాల మురళి కృష్ణ, నిఖిల్, వార్డ్ ఆఫీసర్స్, జవాన్లు,సిబ్బంది పాల్గొన్నారు.