13-09-2025 03:06:43 AM
ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కార్పొరేషన్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జీ.టి.జీవన్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి లాభాలను ఆర్జించి పెడుతున్న సంస్థల్లోనైనా కొత్త ఉద్యోగ నియామాలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్లలో అవసరమైన ఉద్యోగులు లేక పోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.