08-07-2025 10:03:14 PM
కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని నిగువ గ్రామంలోని శ్రీ నగరేశ్వర ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చేరబడి హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్ళినట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. సుమారు పదివేల రూపాయలు నగదు ఉండి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి(SI Krishna Reddy) నిగువ గ్రామంలోని ఆలయాన్ని సందర్శించి వివరాలను గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు.