calender_icon.png 9 July, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఆధార్ ప్రత్యేక కౌంటర్..

08-07-2025 10:06:28 PM

టీయూడబ్ల్యూజే ఐజేయు విజ్ఞప్తి..

హామీ ఇచ్చిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంప్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం నాడు డియుడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్(Additional Collector Venugopal)కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆధార్ ఈడీఎం సైదేశ్ కు అదనపు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం ఈ మెగా క్యాంపు అనంతరం త్వరలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తేదీలు తెలియజేస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఈ మెగా ఆధార్ సవరణల కేంద్రంలో ఇబ్బంది పడకుండా జర్నలిస్టులందరి కోసం ఏర్పాటు చేసే తేదీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతిష్టాత్మక దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఆధార్ సవరణల మెగా క్యాంప్ జూలై 9, 10వ తేదీలలో జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఉదయ్ కుమార్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ పాల్గొన్నారు.