13-08-2025 12:00:00 AM
వాజేడు, ఆగస్టు 12 (విజయ క్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం సిఐ గా నూతన బాధ్యతలు చేపట్టిన ముత్యం రమేష్ ను, వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతిరావు ను, వాజేడు మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ ఆధ్వర్యంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన అధికారికి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ స్థానికగా ఉన్న ప్రధాన సమస్యల గురించి వివరించడం జరిగింది. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాజేడు నాగారం మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకర్లపూడి కళ్యాణ్ వెంకటాపురం మాజీ ఎంపీటీసీ గార్లపాటి రవి పశువుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు