13-08-2025 12:00:00 AM
కామారెడ్డి, ఆగస్టు 12 (విజయ క్రాంతి) : స్థానిక ఆర్.కె డిగ్రీ & పీజీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక యువత చర్యలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మరియు భవిష్యత్తు అనే 2025 థీమ్ పై మోటివేషనల్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డా. బి. అంజయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తు, ప్రతి యువకుడు లక్ష్యం నిర్దేశించుకుని కృషి చేస్తే, సమాజం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తుందని పేర్కొన్నారు.
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్థానిక యువత ముందుండాలని చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులు తీసుకొస్తాయని డా. ఎం. జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ అన్నారు. ప్రోగ్రామ్ చైర్మన్ పున్న రాజేష్ (లెర్నింగ్ ఫెసిలిటేటర్) కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షుడు యాచం శంకర్, సుధాకర్ , కార్యదర్శి సబ్బని కృష్ణ హరి, కోశాధికారి పరుష వెంకటరమణ ఆర్.కె డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బాలు, ఏఓ శ్రీధర్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ లింగం, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.