07-01-2026 12:16:37 AM
తలమడుగు, జనవరి 6 (విజయక్రాంతి): రైతులు పండించిన పంటలన్నింటినీ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం తాంసి, తలమడుగు మండలాల నాయకులు సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులతో ఎస్సై రాధిక, తాంసి ఎస్‌ఐ జీవన్ రెడ్డి మాట్లాడి నిరసనను విరమింపజేయించారు.
ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఆదిలాబాద్ బంద్‌లో పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్న అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సోయాబీన్‌ను కొనడం లేదనీ నిలదీస్తే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, సుంకిడి సర్పంచ్ మగ్గిడి ప్రకాష్, ప్రకాష్, కేదారేశ్వర్ రెడ్డి, రమాకాంత్ అబ్దుల్లా, తోట శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, రమణ రఘు పాల్గొన్నారు.