calender_icon.png 25 August, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ నర్సింగ్ కాలేజీలో ఘనంగా మహా సుదర్శన యాగం

25-08-2025 07:18:35 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు 

బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట గ్రామంలో గల నర్సింగ్ కాలేజ్ త్వరలో ప్రారంభం కానున్న బాన్సునాడ బి ఎస్ సి  నర్సింగ్ కాలేజీ లో వేద పండితులు సోమవారం ఘనంగా మహా సుదర్శన యాగాన్ని నిర్వహించారు. ఉదయం పుణ్యావచనము, శ్రీ లక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థాపన అంగరంగ వైభవంగా జరిపించారు. యాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హోమ గుండం వద్ద గణపతి, కలశపూజ, కంకణ ధారణ, నవగ్రహ పూజా అనంతరం సుదర్శన యాగం నిర్వహించి చివరగా పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాదాలను భక్తులకు అందించారు. అనంతరం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మహా సుదర్శన యాగంలో పాల్గొన్న పోచారం ఈ యాగంలో బాన్సువాడ, నసురుల్లాబాద్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థినిలు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.